వాహనం యొక్క పూర్తి వివరాలు
తెలుసుకోండి ఇలా
ఫలానా వెహికల్ ఎవరిదో ఏమిటో
కొన్నిసార్లు తెలుసుకోవాల్సి వస్తుంటుంది. వెహికల్ యొక్క Registration Number నంబర్
తెలిస్తే చాలు, ఆంధ్రా
మరియు తెలంగాణాకు చెందిన ఏ వెహికల్ వివరాలైనా aptransport.in వెబ్_సైట్ ద్వారా క్షణాలలో
తెలుసుకోవచ్చు.
aptransport.in విజిట్
చేయగా ఆంధ్రా మరియు తెలంగాణా అంటూ రెండు లింకులు డిసిప్లే అవుతాయి.
వివరాలు తెలుసుకోదలచిన
వెహికల్ ఆంధ్రాకు చెందినదై ఉంటే ఆంధ్రా లింక్, లేదా తెలంగాణాకు చెందినదై ఉంటే తెలంగాణా లింక్ క్లిక్ చేయాలి.
ఇప్పుడు Registration Number Search అనబడే
లింక్ క్లిక్ చేయగా Vehicle Registration Search అనబడు ఒక సింపుల్ ఫారం
ప్రత్యక్షమవుతుంది.
ఫారంలోని Select Search Element ఆప్షన్
ఎలా ఉన్నదో అలాగే ఉంచి, Enter
Search Element అని రాసి ఉన్న టెక్స్ట్ బాక్స్_లో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ (ఎటువంటి గ్యాప్ ఇవ్వకుండా)
టైప్ చేసి బటన్ క్లిక్ చేస్తే చేయాలి (తెలంగాణా Vehicle
Registration Search అయితేగనక
రిజిస్ట్రేషన్ నంబర్_తో పాటు
అదనంగా Chassis Number ఆఖరి ఐదు
నంబర్లను Enter Last 5 Digits
Of Chassis Number అని రాసి ఉండే టెక్స్ట్ బాక్స్_లో టైప్ చేయవలసి ఉంటుంది) వెహికల్_కు సంభందించి పూర్తి
వివరాలు డిసిప్లే అవుతాయి.
ఈ విధంగా వెహికల్ యొక్క
పూర్తి డీటెయిల్స్ పొందవచ్చు.