నా విండోస్ 7 (with 3.0 dualcore processer) పీసీపై
యూజ్ చేసిన తర్వాతే ఈ రివ్యూ రాస్తున్నాను. అద్భుతమైన డివైజ్. ఒక సాధారణ మొబైల్
ఫోన్లో ఉండే ఫీచర్లన్నీ ఈ మోడెమ్_లో
పొందుపరిచారు. మోడెమ్_ను పీసీ USB port_కి
కనెక్ట్ చేయడమే ఆలస్యం. (మొట్టమొదటి సారి అయితే మోడెమ్_లోనే అందుబాటులో ఉంచిన
సాఫ్ట్_వేర్
ఇంస్టాల్ చేయాలనుకోండి) మోడెమ్ సహాయంతో పీసీలో ఇంటర్నెట్ పొందడంతోపాటు పీసీ నుంచే
వాయిస్ కాల్స్, SMS_లు, USSD వాడుకోవచ్చు.
ఎంత డేటా వాడాము, నెట్
స్పీడ్ ఎంత ఉంది, మోడెమ్
కనెక్ట్ చేసి ఎంతసేపయిందీ వంటి తదితర వివరాలూ అందించే ఫెసిలిటీ ఉంది. మైక్రోఫోన్
ఉన్న హెడ్_సెట్
ఉంటే చాలు ఫోన్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. అలాగే ముఖ్యమైన ఫోన్ నంబర్లను సేవ్
చేసుకునేందుకు contacts పేరుతో
ఫోన్_బుక్
కూడా అందించబడింది.
నెట్ స్పీడ్ విషయానికొస్తే
నేను ఉపయోగించేది టూజీ నెట్ కాబట్టి సెకనుకు 25kB నుంచి 30kB లోపు స్పీడ్ ఉంటోంది. త్రీజీ నెట్ 21MBPS వరకు
వేగం ఉంటుంది. పర్ఫామెన్స్ కూడా బాగుంది. గంటలతరబడి నెట్ వాడుతున్నా ఎటువంటి
అంతరాయం లేకుండా సర్వీస్ ఇస్తోంది.
D-link DWP-157 3G Modem Review